న్యూఢిల్లీ: మన దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్ఏఎఫ్ఎల్డీ) బాధపడుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటి జీవనశైలి వ్యాధులకు మూల కారణాల్లో ఎన్ఏఎఫ్ఎల్డీ ఒకటి అని చెప్పారు. ఎన్ఏఎఫ్ఎల్డీకి సంబంధించి సవరించిన ఆపరేషనల్ గైడ్‌లైన్స్‌ను కేంద్రం శుక్రవారం విడుదల చేసింది.
ఎన్ఏఎఫ్ఎల్డీ నుంచి బయటపడాలంటే, క్రమం తప్పకుండా శారీరక కార్యకలాపాలను నిర్వహించాలి. వారానికి కనీసం 150 నిమిషాలపాటు ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలి. వారానికి రెండుసార్లు దారుఢ్య శిక్షణ పొందాలి. కదలకుండా కూర్చుని ఉండే సమయాన్ని తగ్గించుకోవాలి. ఆల్కహాల్‌ను పూర్తిగా నివారించాలి. ఎన్ఏఎఫ్ఎల్డీని సకాలంలో గుర్తించడం వల్ల ఈ వ్యాధి మరింత పెరగకుండా నిరోధించవచ్చునని ఈ మార్గదర్శకాలు తెలిపాయి.