పొగరాయుళ్లకు ఉపశమనం!
కేంద్ర బడ్జెట్లో ఈసారి పొగరాయుళ్లకు ఉపశమనం లభించింది. మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25లో పొగాకు ఉత్పత్తులపై పన్నులో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు.
- పొగాకు ఉత్పత్తులపై పన్నులు పెంచని కేంద్రం
న్యూఢిల్లీ, జూలై 24: కేంద్ర బడ్జెట్లో ఈసారి పొగరాయుళ్లకు ఉపశమనం లభించింది. మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25లో పొగాకు ఉత్పత్తులపై పన్నులో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు.
ప్రతి బడ్జెట్లో పన్నులు పెంచే జాబితాలో తప్పనిసరిగా ఉండే పొగాకు ఉత్పత్తుల్ని, మోదీ సర్కార్ ఈసారి ముట్టుకోలేదు. దీంతో దేశంలో ప్రముఖ సిగరెట్ల తయారీ కంపెనీ ‘ఐటీసీ’ షేర్లు 5శాతం పెరిగాయి. ఏటా ప్రతి బడ్జెట్లో పొగాకు ఉత్పత్తులపై కేంద్రం ‘నేషనల్ కలామిటీ కంటింజెంట్ డ్యూటీ’ (ఎన్సీసీడీ) పేరుతో పన్నులు పెంచేది. దీంతో పొగతాగే వాళ్ల జేబుకు పెద్ద ఎత్తున చిల్లు పెడుతూ వస్తున్నది. గత ఏడాది ఎన్సీసీడీ పన్ను రేట్లు 16శాతం పెరిగాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

