న్యూఢిల్లీ: ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ఇవాళ ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇటీవల ఆ బిల్లును రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. భారతీయ పౌరులు అందరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా యూసీసీ బిల్లును రూపొందించారు. ఆ చట్టాలకు మతపరమైన అధికారాలు ఉండవు. పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత లాంటి వ్యక్తిగత విషయాల అంశంలో ఉమ్మడి పౌర స్మృతి బిల్లు కీలకం కానున్నది.
ఒకవేళ ఈ బిల్లు అసెంబ్లీలో పాసైతే అప్పుడు దాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. స్వాతంత్య్రం తర్వాత ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలువనున్నది. అయితే ఇదే చట్టాన్ని అమలు చేయడానికి బీజేపీ పాలిత రాష్ట్రాలైన అస్సాం, మధ్యప్రదేశ్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పోర్చుగీసు పాలనలో ఉన్న గోవాలో కూడా ఇలాంటి సివిల్ కోడ్ రూల్ చాన్నాళ్లుగా అమలులో ఉన్నది.
బహుభార్యత్వాన్ని రద్దు చేసే ఉద్దేశంతో ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక లివిన్ రిలేషన్లో ఉన్న జంటలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా ఆంక్షలు పెట్టనున్నారు.
देवभूमि उत्तराखण्ड के नागरिकों को एक समान अधिकार देने के उद्देश्य से आज विधानसभा में समान नागरिक संहिता का विधेयक पेश किया जाएगा।
यह हम सभी प्रदेशवासियों के लिए गर्व का क्षण है कि हम UCC लागू करने की दिशा में आगे बढ़ने वाले देश के पहले राज्य के रूप में जाने जाएंगे।
जय हिंद, जय…
— Pushkar Singh Dhami (@pushkardhami) February 6, 2024