తిరువనంతపురం, జూలై 24: చేపల వేటకు వెళ్లిన కేరళ జాలర్ల బృందానికి అంబర్గ్రిస్ (తిమింగళం వాంతి) లభించింది. 28.4 కిలోల బరువున్న దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.28 కోట్లు. పెర్ఫ్యూమ్ల తయారీకి వినియోగించే అంబర్ గ్రిస్ అంతర్జాతీయ బహిరంగ మార్కెట్లో కిలో కోటి నుంచి రూ.2 కోట్ల వరకు పలుకుతుంది. 28 కిలోల అంబర్ గ్రిస్ విలువ మార్కెట్లో రూ.28 కోట్ల వరకు పలుకుతుంది. అయితే భారత్లో దీని అమ్మకంపై నిషేధం విధించారు.