New Delhi : సాధారణంగా వెండింగ్ మెషీన్లు అనగానే వాటిలో వాటర్ బాటిల్స్, కూల్డ్రింక్స్, స్నాక్స్ వంటివి అందుబాటులో ఉంటాయి. అప్పుడప్పుడూ కాఫీ, టీలు, ఇతర ఫుడ్, చివరకు గోల్డ్ వంటివి కూడా విక్రయిస్తుంటారు. కానీ, వెండింగ్ మెషీన్లలో అండర్వేర్స్ అమ్మడం ఎప్పుడైనా చూశారా..? లేదు కదూ. కానీ, ప్రస్తుతం అలా అండర్వేర్ అమ్మే వెండింగ్ మెషీన్ అందుబాటులోకి వచ్చింది.
ఢిల్లీ మెట్రో స్టేషన్లో ప్రస్తుతం ఈ రకమైన వెండింగ్ మెషీన్ ఏర్పాటైంది. ఢిల్లీలోని రోహిణి ఈస్ట్ మెట్రో స్టేషన్లో దీన్ని ఇటీవలే అందుబాటులోకి తెచ్చారు. దీనికి సంబంధించి ఒక యూజర్ ఈ మెషీన్ను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఇది మంచి ఐడియా అని, ఉపయోగకరం అని అంటుంటే.. ఇంకొందరు ఇదేం దిక్కుమాలిన సంత అంటూ విమర్శిస్తున్నారు. అసలు.. తమ దగ్గర ఏదైనా సమయానికి లేకపోతే వాటిని కొంటుంటారు. అలాంటిది అండర్ వేర్ మర్చిపోయి మెట్రో రైళ్లలో ఎవరైనా ప్రయాణిస్తారా.. అలా మర్చిపోయి మరీ ఇక్కడికొచ్చి అండర్వేర్లు కొంటారా అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఇంకొందరు మాత్రం ఇది మగవారికంటే స్త్రీలకే ఎక్కువగా ఉపయోగపడుతుందని అంటున్నారు. అయితే, ఈ మెషీన్ సౌకర్యం అందరికీ ఉపయోగపడకపోవచ్చని, నేటి బిజీ లైఫ్లో షాపింగ్ చేసే టైం లేనివారు తమ అండర్వేర్స్ ఇక్కడే కొనుక్కోవచ్చని మరో యూజర్ కామెంట్ చేశాడు.