ఇంటి అద్దె చెల్లించలేక.. భార్య, కుమార్తెపై అత్యాచారానికి యజమానితో వ్యక్తి ఒప్పందం
Man Lets Landlord Rape Wife, Daughter | ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక వ్యక్తి ఇంటి కిరాయి చెల్లించలేకపోయాడు. అద్దె బకాయిలు పేరుకుపోవడంతో వాటి మాఫీ కోసం ఇంటి యజమానితో ఒప్పందం చేసుకున్నాడు. తన భార్య, కుమార్తెపై ఇంటి ఓనర్ అత్యాచారానికి అతడు అనుమతించాడు.
అహ్మదాబాద్: ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక వ్యక్తి ఇంటి కిరాయి చెల్లించలేకపోయాడు. అద్దె బకాయిలు పేరుకుపోవడంతో వాటి మాఫీ కోసం ఇంటి యజమానితో ఒప్పందం చేసుకున్నాడు. తన భార్య, కుమార్తెపై ఇంటి ఓనర్ అత్యాచారానికి అతడు అనుమతించాడు. (Man Lets Landlord Rape Wife, Daughter) ఫిర్యాదు అందుకున్న పోలీసులు, ఆ వ్యక్తితో పాటు ఇంటి యజమానిని అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని సురేంద్రనగర్‌కు చెందిన ఒక కుటుంబం జీవనోపాధి కోసం ఆరు నెలల కిందట మోర్బికి వలస వచ్చింది. నెలకు రూ. 2,000 కిరాయికి ఒక అద్దె ఇంట్లో వారు నివసిస్తున్నారు.
కాగా, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ వ్యక్తి నాలుగు నెలలుగా ఇంటి కిరాయి చెల్లించలేదు. దీంతో అద్దె బకాయిలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇంటి కిరాయి బకాయిల మాఫీ కోసం ఓనర్‌తో అతడు ఒప్పందం చేసుకున్నాడు. తన భార్య, మైనర్ కుమార్తెపై అత్యాచారం చేసేందుకు ఇంటి యజమానికి అనుమతి ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఆ మహిళ, ఆమె కుమార్తెపై ఆ ఇంటి ఓనర్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
మరోవైపు ఆ వ్యక్తి భార్య తల్లికి ఈ విషయం తెలిసింది. దీంతో మోర్బి పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోక్సో చట్టంతో సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తిని, ఇంటి ఓనర్‌ను అరెస్ట్ చేశారు. ఈ నేరంలో ప్రమేయం ఉన్న మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అతడి కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు.
Also Read:
Man Plants ‘Bomb’ At Hospital | చికిత్సకు డబ్బులు లేక.. ఆసుపత్రిలో బాంబు పెట్టిన వ్యక్తి
four deliveries in 5 days | ఐదు రోజుల వ్యవధిలో రెండు కాన్పులు.. నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

