Lucknow Professor Arrested | ‘డార్లింగ్.. నీ కోసం ఎగ్జామ్ పేపర్స్ తెచ్చా, ఎప్పుడు కలుస్తావు?’.. ప్రొఫెసర్ వేధింపులపై విద్యార్థిని ఫిర్యాదు
Lucknow Professor Arrested | ఒక విద్యార్థినిని ప్రొఫెసర్ వేధింపులకు గురి చేశాడు. ఆమె కోసం ఎగ్జామ్ పేపర్స్ లీక్ చేసి తెచ్చానని, తనను కలవాలని కోరాడు. ఆడియో కాల్ రికార్డ్ చేసిన ఆ విద్యార్థిని యూనివర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.
లక్నో: ఒక విద్యార్థినిని ప్రొఫెసర్ వేధింపులకు గురి చేశాడు. ఆమె కోసం ఎగ్జామ్ పేపర్స్ లీక్ చేసి తెచ్చానని, తనను కలవాలని కోరాడు. ఆడియో కాల్ రికార్డ్ చేసిన ఆ విద్యార్థిని యూనివర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. (Lucknow Professor Arrested) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. లక్నో యూనివర్సిటీలోని జుయాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పరమ్‌జిత్ సింగ్ పని చేస్తున్నాడు. బీఎస్పీ విద్యార్థినికి ఆయన ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. ‘డార్లింగ్ నీ కోసం రెండు ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసి తెచ్చాను. నన్ను కలవడానికి ఎప్పుడు వస్తావు?’ అని అడిగాడు.
కాగా, తాను సిలబస్ పూర్తిగా చదివినట్లు ఆ విద్యార్థిని తెలిపింది. ఇంట్లో పనుల వల్ల కలవలేనని చెప్పింది. అయినప్పటికీ తనను కలవడానికి ఒక్కసారి రావాలని ప్రొఫెసర్ పరమ్‌జిత్ సింగ్ అన్నాడు. పరీక్షలకు ముందే ఏడు రోజుల్లోగా తనను కలవాలని కోరాడు. ఆ ప్రొఫెసర్ ఆడియా కాల్స్‌ను ఆ విద్యార్థిని రికార్డ్ చేసింది. లైంగికంగా వేధించడానికే తనను ఆయన పిలిచినట్లు ఆరోపించింది. రెండు ఆడియో క్లిప్‌లను యూనివర్సిటీ యాజమాన్యానికి సమర్పించింది.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. ఆ ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ యాజమాన్యం దర్యాప్తు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రొఫెసర్ పరమ్‌జిత్ సింగ్‌ను అరెస్ట్ చేశారు.
అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆ ప్రొఫెసర్ ఖండించాడు. యూనివర్సిటీలోని అంతర్గత రాజకీయాల కారణంగా తప్పుడు కేసులో తనను ఇరికించినట్లు ఆయన ఆరోపించాడు. కాగా, విద్యార్థినితో ప్రొఫెసర్ మాట్లాడిన ఆడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Audio of Lucknow University’s lovelorn assistant professor Paramjit Singh has gone viral. In it, he is seen pressuring a BSc student to meet him repeatedly.
Professor is also brazenly claiming to have leaked not one but two papers. In any case, now that the full matter has come… pic.twitter.com/W92nljIXgM
— Devanshu Mani Tripathi (@devanshu_mani) May 16, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

