భోపాల్: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాలేశ్వరుడి శివాలయం వద్ద ఇవాళ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు మరికొంత మంది వీఐపీలు ఆలయ దర్శనం చేసుకున్నారు. దీంతో సామాన్య భక్తులను కాసేపు ఆపాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో ఆలయం బయట తొక్కిసలాట జరిగింది. నాలుగవ గేటు వద్ద ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. జ్యోతిర్లింగ క్షేత్రమైన ఉజ్జయినిలో ఆలయ దర్శనం కోసం అనుమతి కల్పించారు. సింగిల్ డోసు టీకా వేసుకున్న వాళ్లకి, ఆర్టీ పీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ ఉన్నవాళ్లు మహాకాలేశ్వరుడిని దర్శించుకోవచ్చు. అయితే ఇవాళ వీఐపీల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. భక్తులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియో ఇదే.
#WATCH | A stampede-like situation was seen at Mahakaleshwar Temple in Ujjain, Madhya Pradesh yesterday pic.twitter.com/yxJxIYkAU5
— ANI (@ANI) July 27, 2021