న్యూఢిల్లీ, జనవరి 28 : యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) కొత్త ఆధార్ యాప్‌ని ప్రారంభించింది. ప్రస్తుతం ఇది ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్(ఐఓఎస్)తోపాటు ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. ప్రజలు తమ ఆధార్ వివరాలను సురక్షితంగా నిర్వహించుకోవడంతోపాటు సమాచారాన్ని అప్డేట్ చేసుకోవడం, ఐడెంటిటీ డాటాను సురక్షితంగా షేర్ చేసుకునే విధంగా ఈ యాప్ రూపొందింది.
ఈ కొత్త యాప్ తాజా వెర్షన్ ద్వారా మొబైల్ నంబర్, చిరునామా అప్డేషన్ని ఇందులో చేసుకోవచ్చు. ఐదుగురు కుటుంబ సభ్యుల పేర్లను చేర్చుకుని ప్రొఫైల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. సురక్షితంగా ఆఫ్‌లైన్ ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ ఆధారిత ఐడెంటిటీ కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఇందులో బయోమెట్రిక్ కూడా ఉంది.