Udhyanithi Stalin | సనాతన ధర్మంపై మరోసారి వివాదాస్పద పోస్టు పెట్టిన ఉదయనిధి స్టాలిన్.. ఫొటో వైరల్
Udhyanithi Stalin | తమిళనాడు డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhyanithi Stalin) సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘సనాతన ధర్మం’ (Sanatana Dharma) డెంగీ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చారు.
Udhyanithi Stalin | తమిళనాడు డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhyanithi Stalin) సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘సనాతన ధర్మం’ (Sanatana Dharma) డెంగీ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మత, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. స్టాలిన్ వ్యాఖ్యలపై మతపెద్దలు, అర్చకులు, బీజేపీ సహా కొన్ని పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉదయనిధి మాత్రం తగ్గేదే లే అంటున్నారు. తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా స్టాలిన్ (Udhyanithi Stalin) సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు.
దోమలను చంపేందుకు వాడే మస్కిటో కాయిల్ (Mosquito coil) ఫొటోను ఉదయనిధి స్టాలిన్ (Udhyanithi Stalin) పోస్ట్ చేశాడు. అయితే దీనికి ఎటువంటి క్యాప్షన్ ఇవ్వలేదు. ఇక ఈ ఫొటో ‘సనాతన ధర్మం’ (Sanatana Dharma)పై స్టాలిన్ చేసిన డెంగీ, మలేరియా వ్యాఖ్యలను గుర్తుకుతెస్తుంది. కాగా.. ఈ ఫొటోపై నెటిజెన్లు స్పందిస్తూ.. విమర్శలను ఎలా స్వీకరించాలో, సంఘీలను ఎలా ఇబ్బంది పెట్టాలో ఉదయనిధి స్టాలిన్‌కు బాగా తెలుసంటూ కామెంట్లు చేస్తున్నారు.
— Udhay (@Udhaystalin) September 11, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

