ముంబై: శివసేన యూబీటీ చీఫ్ ఉద్దవ్ థాక్రే(Uddhav Thackeray), ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే ఇవాళ ఓ వేదిక పంచుకున్నారు. 20 ఏళ్ల తర్వాత ఆ ఘటన చోటుచేసుకున్నది. మరాఠీ మహాయుతి ప్రోగ్రామ్ కోసం ఆ ఇద్దరూ ఒక్కటైయ్యారు. హిందీ భాషను మూడవ భాషగా ప్రవేశపెట్టాన్ని థాక్రే సోదరులు వ్యతిరేకించారు. దీంతో మహారాష్ట్ర సర్కారు వెనక్కి తగ్గి.. త్రీ లాంగ్వేజ్ ఫార్ములాను ఉపసంహరించింది. ఈ నేపథ్యంలో మరాఠ సోదరులు ఒకే వేదికపై కలిసి ముచ్చటించారు. ఆ సమయంలో ఉద్దవ్ ఠాక్రే.. పుష్ప ఫిల్మ్ డైలాగ్ కొట్టాడు. పుష్ప సినిమా చూశానని, నాకు కూడా ఆ హీరోలా గడ్డం ఉండి ఉంటే, తగ్గేదేలే డైలాగ్ కొట్టేవాడినన ఉద్ధవ్ తెలిపారు. ఒక్కటి కలిసి ఉండేందుకు ఒక్కటయ్యామని, మరాఠీ భాషను రక్షించేందుకు ఐక్యమైనట్లు తెలిపారు. ఇది ట్రైలర్ మాత్రమే అని, ముందు చాలా ఉందన్నట్లు ఆయన చెప్పారు. బాలాసాహెబ్ థాక్రే చేయలేని పని.. మా ఇద్దర్నీ కలిసి సీఎం ఫడ్నవీస్ చేసినట్లు రాజ్‌థాక్రే తెలిపారు.
ఏంటీ త్రీ లాంగ్వేజ్ పాలసీ ?
మరాఠ, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకు హిందీ భాషను మూడవ భాషగా తప్పనిసరి చేయనున్నట్లు ఇటీవల మహారాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఏప్రిల్ 17వ తేదీన దీనిపై అధికార ప్రకటన చేశారు. కానీ, తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. జూన్ 18వ తేదీన ఆ పాలసీ మార్చేశారు. కొత్త రూల్ ప్రకారం హిందీ భాషను డిఫాల్ట్ మూడవ భాషగా ప్రకటించారు. ఒకవేళ క్లాసులో 20 మంది విద్యార్థులు మరో భాషను ఎంచుకుంటే దాన్ని థార్డ్ లాంగ్వేజ్‌గా ప్రకటిస్తారు. జూన్ 24వ తేదీన దీన్ని పరిశీలించేందుకు ఓ రివ్యూ కమిటీ వేశారు. అయితే మహా వికాశ్ అఘాధీ కూటమి నుంచి నిరంతరం నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని రద్దు చేసుకున్నది.