ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అనుకోకుండా ప్రత్యేకంగా కలిశారు. (Surprise Meet) మాజీ సీఎంలైన వీరిద్దరూ పరస్పరం మాట్లాడుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రాజకీయ ఊహాగానాలు వెల్లువెత్తాయి. మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలి రోజున ప్రత్యర్థులైన ఉద్ధవ్ ఠాక్రే, దేవేంద్ర ఫడ్నవీస్ లిఫ్ట్ కోసం ఎదురు చూశారు. ఈ సందర్భంగా ఇద్దరూ కూడా ఏదో విషయంపై మాట్లాడుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఉద్ధవ్ ఠాక్రే మధ్య పొత్తు ఉండవచ్చన్న రాజకీయ ఊహాగానాలు జోరందుకున్నాయి.
కాగా, అనంతరం ఉద్ధవ్ ఠాక్రేను దీని గురించి మీడియా ప్రశ్నించింది. ఆయన, ఫడ్నవీస్ ఏం మాట్లాడుకున్నారని అని అడిగింది. ‘ఇక నుంచి రహస్య సమావేశాలన్నీ మేం లిఫ్ట్ లోనే చేస్తాం’ అని సరదాగా అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్, తాను లిఫ్ట్‌లో ఉన్నప్పుడు ‘నువ్వు తిరస్కరించినా, నీ ప్రేమలో పడ్డా’ అన్న పాత సినిమా పాట ప్రజలకు గుర్తుకు వచ్చి ఉంటుందని తెలిపారు. అయితే అలాంటిదేమీ లేదని, ఊహించని విధంగా తామిద్దరం కలిసినట్లు చెప్పారు.
Patil Gifted Chocolates
మరోవైపు బీజేపీ మంత్రి చంద్రకాంత్ పాటిల్, ఉద్ధవ్ ఠాక్రే మధ్య సరదాగా మరో సంభాషణ జరిగింది. ఠాక్రేకు చంద్రకాంత్ చాక్లెట్ బార్ ఇచ్చారు. దీనికి స్పందించిన ఉద్ధవ్ ఠాక్రే ‘రేపు మీరు మహారాష్ట్ర ప్రజలకు చాక్లెట్ ఇస్తారు’ అని బదులిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకర్షించడానికి బడ్జెట్లో తాయిలాలు ప్రకటించే విషయాన్ని ఇలా ప్రస్తావించారు. వారంతా నవ్వుకున్న ఈ వీడియో క్లిప్, ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
#maharashtraassembly : Uddhav Thackarey and Devendra Fadnavis in same lift. pic.twitter.com/YzgcZAcoJi
— Sonu Kanojia (@NNsonukanojia) June 27, 2024
Former Maharashtra Chief Minister and #ShivSena chief #UddhavThackeray reached Vidhan Bhavan today on the first day of monsoon session.
Where he met his party's other Legislative Council MLAs, Ambadas Danve and Anil Parab. pic.twitter.com/NoBbGjCB0e
— Afternoon Voice (@Afternoon_Voice) June 27, 2024