Road Accidents | రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణ టాప్.. కేంద్రం నివేదికలో షాకింగ్ నిజాలు..!
Road Accidents | దేశంలోని ఇతర ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2023లో రాష్ట్రవ్యాప్తంగా 22,903 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా, 2024 నాటికి ఆ సంఖ్య 25,986 కి చేరింది. కేవలం ఏడాది కాలంలోనే ప్రమాదాల సంఖ్య 13.5 శాతం పెరగడం గమనార్హం.
Road Accidents : దేశంలోని ఇతర ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2023లో రాష్ట్రవ్యాప్తంగా 22,903 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా, 2024 నాటికి ఆ సంఖ్య 25,986 కి చేరింది. కేవలం ఏడాది కాలంలోనే ప్రమాదాల సంఖ్య 13.5 శాతం పెరగడం గమనార్హం. ఇది జాతీయ సగటు వృద్ధిరేటు (1.5 శాతం) కంటే చాలా రెట్లు అధికంగా ఉండటం గమనార్హం.
ఈ ప్రమాదాల కారణంగా సంభవిస్తున్న మరణాల సంఖ్య సైతం భారీగానే ఉంది. 2024లో రాష్ట్రంలో జరిగిన వివిధ ప్రమాదాల్లో సుమారు 7,900 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల వృద్ధిరేటు (3.7 శాతం) దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోనే అత్యధికంగా నమోదైంది. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణంగా మితిమీరిన వేగాన్ని అధికారులు గుర్తించారు. ఒక్క అతివేగంవల్లే 7,500 కంటే ఎక్కువ ప్రమాదాలు జరగ్గా సుమారు 2,760 మంది మృత్యువాతపడ్డారు. వీటితోపాటు హిట్ అండ్ రన్ కేసులు, వాహనాలను వెనుక నుంచి లేదా పక్క నుంచి ఢీకొట్టడం వంటి ఘటనలు కూడా వేలాది మంది మరణాలకు కారణమవుతున్నాయి.
అయితే, ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరగడంపై రవాణా శాఖ (ఆర్టీఏ) అధికారులు భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. గతంలో నమోదుకాని చిన్నచిన్న ప్రమాదాలను కూడా ప్రస్తుతం రికార్డు చేస్తుండటం వల్లే గణాంకాలలో ఈ పెరుగుదల కనిపిస్తోందని వారు చెబుతున్నారు. రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు ఇప్పటికే జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తద్వారా రోడ్ల ఇంజినీరింగ్ లోపాలను సరిదిద్దడం, నిబంధనల అమలును కట్టుదిట్టం చేయడం, ప్రమాద సమయాల్లో తక్షణ అత్యవసర స్పందన వంటి చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

