బెంగళూరు : గేర్‌లెస్ స్కూటర్ నడుపుతూ 311 ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన బెంగళూరు వ్యక్తి భారీ జరిమానా చెల్లించారు. ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ వేదికగా తెలిపిన వివరాల ప్రకారం, ఈ వ్యక్తిని ఈ నెల 3న గుర్తించి, గేర్‌లెస్ స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ మర్నాడు ఆయన రూ.1,61,500 ఫైన్ చెల్లించడంతో, ఆ స్కూటర్‌ను తిరిగి ఆయనకు ఇచ్చేశారు. ట్రాఫిక్ నిబంధనలను అనుసరించాలని గట్టిగా సూచించారు. ఈ జరిమానా రశీదులను ఒకదాని తర్వాత ఒకటి పేర్చినపుడు 20 మీటర్ల పొడవు ఉన్నాయి.
కోల్‌కతా: వారసత్వంగా కొనసాగుతున్న వలస పాలకుల పేర్లను తొలగించే చర్యలలో భాగంగా కోల్‌కతాలోని ఈస్టర్న్ ఆర్మీ కమాండ్ ప్రధాన కార్యాలయం ఫోర్ట్ విలియం పేరును విజయ్ దుర్గ్గా మార్చుతున్నట్టు సైన్యం బుధవారం ప్రకటించింది. కోల్‌కతా నడిబొడ్డున ఉన్న ఈ క్యాంపస్ లోపల గల వివిధ చారిత్రక భవనాల పేర్లనూ మార్చింది.