శ్రీనగర్, సెప్టెంబర్ 28: జమ్ము కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. అదిగాం అనే గ్రామంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
కుల్గాం అడిషనల్ ఎస్పీ, ముగ్గురు రాష్ట్రీయ రైఫిల్స్ సిపాయిలు, ఒక ట్రాఫిక్ పోలీస్ గాయపడ్డారు. కథువా జిల్లాలోని కోగ్-మండ్లి గ్రామంలో జరిగినమరో ఎన్కౌంటర్ లో ఒక హెడ్ కానిస్టేబుల్ మరణించగా, మరో ఏఎస్సై గాయపడ్డారు. ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.