గోవాలో ఇద్దరు రష్యన్ మహిళల అనుమానాస్పద మృతి..!
Goa deaths: గోవాలో రష్యా దేశానికి చెందిన ఇద్దరు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. గురువారం అలెగ్జాండ్రా డ్జావీ (24) అనే రష్యా మహిళ తన అద్దె ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ

పనాజీ: గోవాలో రష్యా దేశానికి చెందిన ఇద్దరు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. గురువారం అలెగ్జాండ్రా డ్జావీ (24) అనే రష్యా మహిళ తన అద్దె ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించగా, శుక్రవారం అదే దేశానికి చెందిన మరో మహిళ ఎకాటెర్నియా టిటోవా (34) ఓ అపార్టుమెంట్‌లోని తన అద్దె ప్లాట్ బెడ్రూమ్లో విగతజీవిగా పడివున్నది. వరుసగా రెండు రోజులు రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు రష్యన్ మహిళలు అనుమానాస్పదంగా మరణించడం గోవాలో కలకలం రేపింది.
ఈ రెండు ఘటనలు కూడా నార్త్ గోవాలోని సియోలిమ్ గ్రామంలో చోటుచేసుకున్నాయి. కాగా ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఇద్దరి మరణాలకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే దర్యాప్తులో పురోగతి కనిపించే అవకాశం ఉందని చెప్పారు. అయితే, అలెగ్జాండ్రా డ్జావీ కొందరు తనను బ్లాక్మెయిల్ చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని 2019లో చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసిందని.. ఆ కేసుకు, ఈ మరణాలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Goa
- North Goa
- Russina Women
- Siolim
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

