రాంచీ, జూన్ 9: మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఇద్దరు దుండగులకు బాధితురాలి కుటుంబసభ్యులు నిప్పుపెట్టారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో చోటుచేసుకుంది. బాలికపై లైంగికదాడి విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఇద్దరు దుండగులను పట్టుకొని తమ గ్రామానికి తీసుకొచ్చారు.
అనంతరం చితకబాది నిప్పుపెట్టారు. దీంతో తీవ్రగాయాలపాలైన ఇద్దరిని స్థానికులు దవాఖానకు తరలించగా.. వారిలో ఒకడు మృతిచెందాడు. మరొకడు చికిత్స పొందుతున్నాడు.