న్యూఢిల్లీ, జూన్ 17 : ప్రపంచ చమురు మార్కెట్ రవాణాకు జీవనాడిగా పరిగణించే హర్మూజ్ జలసంధి సమీపంలో మూడు నౌకలు మంటల్లో చిక్కుకున్నట్టు సమాచారం. మంటలు ఎందుకు అంటుకున్నాయో కచ్చితమైన కారణం తెలియరానప్పటికీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రాంతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
నౌకల్లో మంటలు చెలరేగినట్టు నాసాకు చెందిన ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి.