ముంబై: పోలీసులుగా నటించిన ఇద్దరు వ్యక్తులు యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 17 ఏళ్ల బాలిక తన ప్రియుడితో కలిసి షికారుకు వెళ్లింది. గమనించిన ఇద్దరు వ్యక్తులు తాము పోలీసులమని చెప్పి వారిని అడ్డగించారు. ఒక వ్యక్తి ఆ యువతిని ఠాకుర్లీ రైల్వే స్టేషన్ సమీపంలోని నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం మరో వ్యక్తి కూడా ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిని మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని ఆమెను బెదిరించారు.
కాగా, బాధితురాలు ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాల సహాయంలో నిందితులను గుర్తించారు. 25 ఏళ్ల కూలీని కల్యాణ్ ప్రాంతంలో, 32 ఏళ్ల టీస్టాల్ యజమానిని డోంబివిలి ప్రాంతంలో అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరైన కూలీకి నేర చరిత్ర ఉందని, అతడిపై ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు.