potholes | ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ గుంతలు.. రహదారి నాణ్యత, అవినీతిపై ఆరోపణలు
potholes | దేశ రాజధాని ఢిల్లీ నుంచి డ్రెహ్రాడూన్ మధ్య నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు వాహనదారులు ఈ భారీ గుంతల గురించి మిగతా వాహనదారులను అప్రమత్తం చేశారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి డ్రెహ్రాడూన్ మధ్య నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు వాహనదారులు ఈ భారీ గుంతల గురించి మిగతా వాహనదారులను అప్రమత్తం చేశారు. (Delhi-Dehradun expressway) సుమారు రూ. 12,000 కోట్ల వ్యయంతో 212 కిలోమీటర్ల పొడవున్న నిర్మించిన ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేను ఏప్రిల్ 14న ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ నగరాల మధ్య కేవలం రెండు గంటల్లోనే సాఫీగా ప్రయాణించేలా ఈ రహదారిని ఏర్పాటు చేశారు.
కాగా, ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమై మూడు నెలలు కూడా కాకముందే రహదారి నాణ్యతలో డొల్లతనం బయటపడింది. ఉత్తరప్రదేశ్ షమ్లీలోని హాథీ కరోడా గ్రామం సమీపంలో ఎక్స్‌ప్రెస్‌వేపై రెండు భారీ గుంతలు ఏర్పాడ్డాయి. ఆ గుంతల్లో వేగంగా వెళ్లిన పలు వాహనాలు అదుపుతప్పడంతో పాటు వీల్స్ దెబ్బతిన్నాయి. ప్రమాదాన్ని పసిగట్టిన కొందరు వాహనదారులు మిగతా వాహనదారులను అప్రమత్తం చేశారు.
మరోవైపు ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేలో ఏర్పడిన భారీ గుంతలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. ‘అవినీతికి ఇంతకంటే ఎక్కువ రుజువు ఇంకేం కావాలి? ప్రతి శాఖలోనూ బహిరంగ దోపిడీ జరుగుతోంది’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ షామా మహమ్మద్ ట్వీట్ చేశారు.
అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ఈ గుంతల వీడియోను పోస్ట్ చేసింది. ‘ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి రూ.12,000 కోట్లు ఖర్చు చేశారు. కానీ కొద్ది కాలంలోనే మోదీ ప్రభుత్వ అభివృద్ధి లోపాలు బయటపడ్డాయి’ అని విమర్శించింది. ‘రూ.110కే 20 శాతం ఇథనాల్ పెట్రోల్ కొంటూ, రూ.650 టోల్ టాక్స్ చెల్లించడాన్ని ఊహించుకోండి, అయినా ప్రాణానికి గ్యారెంటీ లేదు’ అని ఒకరు ఆరోపించారు.
కాగా, ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే ఏర్పడిన భారీ గుంతలపై విమర్శలు, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికారులు స్పందించారు. భారీ గుంతలు ఏర్పడిన ప్రదేశంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.
₹12,000 crore. 79 days. That’s all it took.🫡
Just 79 days after its inauguration by PM Narendra Modi on April 14, the world-class Delhi–Dehradun Expressway has reportedly developed potholes with the onset of the monsoon, damaging vehicles and raising serious questions about… pic.twitter.com/Q9b8j9cwj7
— Deadly Kalesh (@Deadlykalesh) July 2, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamata Banerjee | మమతపై హత్యాయత్నం?.. చీరలో కత్తితో ఇంటటికొచ్చిన యువతి!
Singareni Scam | సింగరేణిలో.. స్కాం గ్రెస్.. రూ.1,600 కోట్ల బొగ్గు ఏమైంది?
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

