Minister D Sarath Kumar | టీవీకే మంత్రి డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు.. ఐపీఎల్ నాటి వీడియో వైరల్
Minister D Sarath Kumar | తమిళనాడులోని అధికార టీవీకే మంత్రి డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఐపీఎల్ సమయంలో స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఆయనకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అయ్యింది. అయితే ఈ ఆరోపణలను ఆ మంత్రి ఖండించారు.
చెన్నై: తమిళనాడులోని అధికార టీవీకే మంత్రి డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఐపీఎల్ సమయంలో స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఆయనకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అయ్యింది. అయితే ఈ ఆరోపణలను ఆ మంత్రి ఖండించారు. (Minister D Sarath Kumar) మాదకద్రవ్యాలకు ప్రజలు దూరంగా ఉండాలని, క్రీడలను స్వీకరించాలని ముఖ్యమంత్రి విజయ్ కోరారు. శుక్రవారం డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. టీవీకే ప్రభుత్వానికి చెందిన మానవ వనరుల శాఖ మంత్రి డీ శరత్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, మంత్రి శరత్ కుమార్‌కు సంబంధించిన పాత వీడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ మ్యాచ్ సమయంలో స్టేడియంలో ఉన్న ఆయన ఒక స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌పై పొడి లాంటి పదార్థాన్ని ఏటీఎం కార్డు, రూ. 500 నోటుతో సరిచేస్తున్న వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. దీంతో ఆయన డ్రగ్స్ సేవించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో శరత్ కుమార్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేశారు.
మరోవైపు మంత్రి శరత్ కుమార్ ఈ ఆరోపణలపై స్పందించారు. తన భార్య, కుమార్తెతో కలిసి రెండు నిమిషాల వీడియో ప్రకటన విడుదల చేశారు. తాను డ్రగ్స్ సేవించినట్లు వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. రెండేళ్ల నాటి పాత వీడియోలో కనిపిస్తున్నది డ్రగ్స్ కాదని తెలిపారు.
అయితే తన బిడ్డ కోసం సిద్ధం చేసిన పొడి చేసిన మాత్ర అని శరత్ కుమార్ చెప్పారు. ‘నా కుమార్తె మందు వేసుకోవాల్సిన అవసరం వచ్చింది. కానీ ఆ మాత్రను అలాగే మింగలేకపోయింది. నీటిలో కలిపి ఇచ్చేందుకు వీలుగా ఆ మాత్రను పొడి చేయమని నా భార్య నన్ను అడిగింది. సరిగ్గా అదే పనిని అప్పుడు నేను చేశా’ అని వివరించారు. స్టేడియం లోపల కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య, నా కుటుంబం, భారీ జనసందోహం మధ్య నేడు ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయడం అన్యాయమని ఆయన అన్నారు.
Minister Sarath Kumar AKA “Ghilli” Sarath drug allegation – Some thoughts and questions! @sarath0828
First of all, it appears to be an old video from an IPL match in which Sarath is seen preparing a “contentious” powder, alleged by some to be a drug.
If it were indeed a drug,… pic.twitter.com/JWBNAsHPnS
— Praveen (@DrPraveenwrites) June 27, 2026
Misleading & Disheartening
TN Minister R. Sarathkumar slammed viral drug allegations, clarifying that an old video simply showed him crushing doctor-prescribed medicine for his daughter He strongly refuted the false claims & urged an end to the misleading social media narrative pic.twitter.com/pAr8FPKzNX— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) June 27, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- drug
- ipl
- medicine
- Sarath Kumar
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

