TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ వెట్రి కజగం (TVK) పార్టీ భారీ విజయంతో సరికొత్త చరిత్ర సృష్టించింది. పార్టీ పెట్టిన తొలి ఎన్నికల్లోనే సినీ నటుడు విజయ్ సంచలన విక్టరీతో ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఖాయమైంది. తమిళ ప్రజలు తమకు కట్టబెట్టిన ఈ చరిత్రాత్మక విజయాన్ని కరూర్ తొక్కిసలాట (Karur Stampede) బాధితులకు టీవీకే పార్టీ అంకితమిచ్చింది.
ఎన్నికల్లో తమ పార్టీ ప్రభంజనం సృష్టించడంతో ఆనందంలో మునిగితేలుతున్న అధవ అర్జున్ మీడియాతో మాట్లాడుతూ తమిళ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు.. నిరుడు సెప్టెంబర్ 27వ తేదీన కరూర్ తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలకు ఈ విజయాన్ని అంకితమిస్తున్నామని వెల్లడించారు. ‘తమిళనాడులో టీవేకే పార్టీ సాధించిన ఈ చరిత్రాత్మక విజయాన్ని కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు అంకితం చేస్తున్నాం.
Chennai | On TVK emerging as the single largest leading party in Tamil Nadu elections, party leader Adhav Arjuna says, “We dedicate this victory to the Karur incident. The practice of cash-for-votes has been eliminated. The people of Tamil Nadu have delivered their verdict. DMK… pic.twitter.com/rFH3h2HspU
— ANI (@ANI) May 4, 2026
మహిళలు మా నాయకుడు విజయ్ను తమ బిడ్డగా, సోదరుడిగా, తమ కుటుంబంలో ఒకడిగా భావించడం వల్లనే టీవీకే పార్టీకి ఇంతటి ఘన విజయం సాధ్యపడింది. వారంతా విజయ్ను నమ్మకస్తుడైన నాయకుడిగా చూశారు. టీవీకే పార్టీ కార్యకర్తలను సైతం తమిళ మహిళా ఓటర్లు తమ బిడ్డలుగా అనుకున్నారు. అందుకే.. ఈ రోజు తమిళగ వెట్రి కజగం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది’ అని అధవ అర్జున పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం.. 62 స్థానాల్లో టీవీకే అభ్యర్థులు జయకేతనం ఎగురవేయగా.. మరో 45 స్థానాల్లోనూ ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తంగా 107 స్థానాల్లో టీవీకే విజయం ఖాయమవ్వనుంది. పార్టీ అధినేత విజయ్ పెరంబూర్, త్రిచీ ఈస్ట్.. రెండు చోట్లా గెలుపొందారు.