TVK chief Vijay : కరూర్ తొక్కిసలాట (Karur stampede) ఘటనకు ముందు టీవీకే చీఫ్ (TVK chief), నటుడు విజయ్ (Actor Vijay) ప్రచారరథం ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ప్రచారరథాన్ని సీజ్ చేశారు. ఆ వాహనం నడిపిన డ్రైవర్ను విచారిస్తున్నారు.
ఇటీవల తమిళనాడులోని కరూర్ జిల్లాలో విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఎందుకంటే ఈ ఘటనలో ఏకంగా 41 మంది మరణించారు. 80 మందికిపైగా గాయపడ్డారు. ఇదిలావుంటే ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో పోలీసులు మరో కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు.