చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే(TVK) విజయదుందుబి మోగించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఆ పార్టీ టికెట్‌పై తొలిసారి పోటీ చేసిన ఎంఎల్ విజయప్రభు అత్యధిక మెజారిటీతో గెలిచారు. రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు గెలుచుకున్న టీవీకే నేతగా ఆయన నిలిచారు. మాదవరం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి కన్నా.. టీవీకే అభ్యర్థి విజయప్రభుకు 1,90,462 ఓట్లు అధికంగా పోలయ్యాయి. విజయప్రభు తొలిసారి ఎమ్మెల్యేగా ఎంట్రీ ఇచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో కలిపి అతను అత్యధికంగా ఓట్లను గెలుచుకున్నారు. రెండో స్థానంలో నిలిచిన ఎస్ సుదర్శనమ్కు 95,477 ఓట్లు పోలయ్యాయి.
ఇవాళ టీవీకే చీఫ్ విజయ్.. పార్టీ సిద్ధాంత నేతలకు నివాళి అర్పించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేతో ఆయన మీటింగ్ నిర్వహించారు. పెరియా్ ఈవీ రామస్వామి, బీఆర్ అంబేద్కర్, కే కామరాజ్, వేలు నాచియార్, అంజలీ అమ్మాల్ విగ్రహాలకు విజయ్ నివాళి అర్పించారు.