న్యూఢిల్లీ, మార్చి 7: భారతీయ సాహిత్య పురస్కారాలలో అత్యుత్తమమైనదిగా భావించే సాహిత్య అకాడమీ అవార్డులను అనువాద రచనలు చేసిన 21 మందికి శుక్రవారం ప్రకటించారు అత్యుత్తమమైన అనువాద రచనలు చేసినందుకు 2024 సంవత్సరానికి తెలుగులో తుర్లపాటి రాజేశ్వరి, హిందీలో మదన్ సోని, ఇంగ్లిష్లో అనిసుర్ రెహమాన్లతో పాటు మొత్తం 21 మందికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డు కింద 50 వేల నగదుతో పాటు తామ్ర పత్రాన్ని అందజేస్తారు.