షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లా(Shimla)లో ఓ భారీ ట్రక్కు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన ఆ ట్రక్కు.. రోడ్డుకు ఇరువైపున ఆగి ఉన్న వాహనాలపై దూసుకెళ్లింది. తియాగ్-చైలా రోడ్డు మార్గంలో ఈ ఘటన జరిగింది. భారీ లోడుతో వస్తున్న ఆ ట్రక్కు ఓ దగ్గర కిందకు ఒరిగిపోయింది. ఆ స్పీడ్లోనే అది రోడ్డు పక్కన ఆగిన కార్లను ఢీకొట్టింది. ఓ కారులో ఉన్న ఇద్దరు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. సుమారు అయిదు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఆ ఘటనకు చెందిన వీడియో ఇదే.
Two people died after 4-5 vehicles were hit by a truck by a truck which overturned after the driver lost control of the vehicle on Theog-Chhaila road in Shimla district today. pic.twitter.com/uoMKYpZm37
— Raajeev Chopra (@Raajeev_Chopra) August 8, 2023