అగర్తలా: త్రిపుర జగన్నాథ రథయాత్రలో విషాధం చోటుచేసుకుంది. జగన్నాథ భక్తులు ఇక్కడ చేపట్టిన ‘ఉల్టా రథయాత్ర’లో ఓ రథం హై టెన్షన్ కరెంట్ తీగలను తాకి..నిప్పుల్లో చిక్కుకుంది. ఉనాకోటి జిల్లా కుమార్ఘాట్ ప్రాంతంలో ఇనుముతో చేసిన రథం ఒకటి 133కేవీ వైర్లను తాకటంతో..పెద్దఎత్తున మంటలు చెలరేగాయని, విద్యుత్ఘాతంతో కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఆరుగురు దుర్మరణం పాలయ్యారని, మరో 15మందికి తీవ్ర గాయాలయ్యాయని పోలీస్ అధికారి జ్యోతిష్మాన్ దాస్ మీడియాకు తెలిపారు.
గాయపడ్డవారిని స్థానిక దవాఖానకు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. అయితే వీరిలో చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం.