Clouded Leopard | అడవికి రారాజు ఎవరంటే సింహం లేదా పులి అంటారు. కొన్ని అడవుల్లో పులులదే రాజ్యం ఉంటుంది. ఈ ప్రపంచంలో చాలా రకాల జాతులకు చెందిన పులులు ఉంటాయి. కానీ.. చాలా జాతులు ఇప్పటికే అంతరించిపోయాయి. మరికొన్ని అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఈనేపథ్యంలో పులిని చూడాలంటే చాలా కష్టం. జూకి వెళ్తే.. లేకపోతే ఏదైనా పార్క్‌కు వెళ్తే అక్కడ చూడటం తప్పితే.. అడవుల్లో పులుల సంఖ్య చాలావరకు తగ్గిపోయింది.
అలాంటి అరుదైన జాతికి చెందిన ఓ చిరుత పులి తాజాగా కనిపించింది. దాన్ని Clouded Leopard అంటారు. ఇది ఎక్కువగా ఎత్తైన ప్రదేశాల్లో మాత్రమే ఉంటుంది. కొండలు, గుట్టలు లాంటి ప్రదేశాలను మేఘాలు తాకుతూ ఉంటాయి. ఈ చిరుత పులులు కూడా అక్కడే ఉంటాయి కాబట్టి.. వీటికి క్లౌడెడ్ లెపార్ట్ అనే పేరు వచ్చింది.
తాజాగా ఈ జాతికి చెందిన ఒక చిరుతపులి నాగాలాండ్ రాష్ట్రంలో కనిపించింది. అది కూడా ఇండియా, మయన్మార్ బార్డర్లో.. 3700 మీటర్ల ఎత్తులో ఈ పులి కెమెరా కంటికి చిక్కింది.
ఈ జాతి చిరుతలు.. ఎంత పెద్ద చెట్లను అయినా అవలీలగా ఎక్కేస్తాయి. వీటినే Neofelis nebulosa అని కూడా పిలుస్తారు. ఇవి పెద్దపులులంత పెద్దగా ఉండవు. మీడియం సైజ్‌లో ఉంటాయి. ఢిల్లీకి చెందిన Wildlife Protection Society of India అనే ఓ ఎన్జీవో నాగాలాండ్‌లోని కిఫిరె జిల్లా తానమిర్ గ్రామంలో ఉన్న అడవిలో కొన్ని కెమెరాలను ఏర్పాటు చేశారు. తమ రీసెర్చ్ కోసం.. అడవుల్లో ఉన్న జంతువుల ఫోటోలు, వీడియోలు క్యాప్చర్ చేయడం కోసం ఏర్పాటు చేసిన కెమెరాలు అవి. ఆ కెమెరాకు ఈ చిరుత పులి చిక్కింది.
ఆ అడవి.. అత్యంత ఎత్తులో ఉంటుంది. సరామతి పర్వతం అంటే నాగాలాండ్‌లోనే అత్యంత ఎత్తైన ప్రదేశం. అక్కడే ఈ జాతికి చెందిన చిరుత పులులు సంచరిస్తుంటాయి. తానమిర్ ప్రాంతంలో ఉండే బయో డైవర్సిటీ కల్చర్‌పై డాక్యుమెంటరీ తీయడం కోసం వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా రీసెర్చర్స్ కెమెరాలు ఏర్పాటు చేశారు. తమ కెమెరాల్లో రెండు చిరుతపులులు, రెండు వాటి పిల్లలు కనిపించాయని రీసెర్చర్స్ స్పష్టం చేశారు.