Karnataka | బళ్లారి: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో సర్కారు దవాఖానల నిర్వహణ దారుణంగా తయారైంది. బళ్లారిలోని బళ్లారి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(బిమ్స్) ఇటీవలి పరిస్థితులు దవాఖానల దుస్థితికి అద్దం పడుతున్నాయి. గురువారం ప్రమాదానికి గురై దవాఖానలో చేరిన ఓ వ్యక్తికి వైద్యులు ఫోన్ టార్చ్లైట్ల వెలుతురులో వైద్యం చేస్తున్న వీడియో వైరల్గా మారింది. అత్యవసర విభాగంలో కరెంటు పోవడంతో టార్చ్లైట్లు పెట్టుకొని వైద్యులు కుట్లు వేశారు. రెండేండ్ల క్రితమే ప్రారంభించిన ఈ దవాఖానలో ఇటీవలే ఆరు ప్రసూతి మరణాలు సంభవించాయి.