Training Aircraft | గాలిలో ఉండగా సాంకేతిక సమస్య.. అత్యవసరంగా ల్యాండ్ అయిన శిక్షణ విమానం
Training Aircraft | బెలగావి: కర్ణాటకలోని (Karnataka) బెలగావిలో పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక సమస్య (Training Aircraft) తలెత్తడంతో ఓ శిక్షణ విమానంలో అత్యవసరంగా ల్యాండ్ (Emergency landing) అయింది.
Training Aircraft | బెలగావి: కర్ణాటకలోని (Karnataka) బెలగావిలో పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక సమస్య (Training Aircraft) తలెత్తడంతో ఓ శిక్షణ విమానంలో అత్యవసరంగా ల్యాండ్ (Emergency landing) అయింది. బెలగావిలోని (Belagavi) సాంబ్రా విమానాశ్రయం (Sambra airport) నుంచి ఓ శిక్షణ విమానం ఉదయం 9.30 గంటలకు టేకాఫ్ అయింది. అయితే గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే అందులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్ దానిని విమానాశ్రయం సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో అత్యవసరంగా దించేశాడు. దీంతో శిక్షకుడితోపాటు ట్రైనీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
విషయం తెలుసుకున్న ఎయిర్‌ఫోర్స్ అధికారులు, ట్రెయినింగ్ స్కూల్‌కు చెందిన అధికారుల, హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరిని బెలగావి ఎయిర్‌ఫోర్స్ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి స్థిరంగానే ఉందని తెలిపారు.

కాగా, సోమవారం ఉదయం భారతీయ వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్ (Apache Helicopter) మధ్యప్రదేశ్‌లోని బిండ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. చాపర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలెట్ అత్యవసరంగా దించాడని అధికారులు తెలిపారు. అయితే పైలెట్ అప్రమత్తంగా ఉండడం వల్ల హెలికాప్టర్‌ను సురక్షితంగా దించామని, భారీ ప్రమాదాన్ని తప్పించామని అధికారులు తెలిపారు. ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్.. ప్రపంచంలో అత్యంత ఆధునిక హెలికాప్టర్. మల్టీరోల్ ఆపరేషన్స్‌లో దీన్ని వాడుతారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద 22 అపాచీ హెలికాప్టర్లు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

