లక్నో: ఓ మహిళ వెనుకాముందు చూసుకోకుండా రైలు పట్టాలు దాటే ప్రయత్నం చేసింది. కానీ ఇంతలో గూడ్స్ రైలు ఆమె వైపు దూసుకొచ్చింది. రైలు మరీ సమీపంలోకి రావడంతో ఆమె వేగంగా ట్రాక్ దాటే ప్రయత్నం చేసింది. ఇంతలో కాలుకు పట్టాలు తగలడంతో ట్రాక్‌పై పడిపోయింది. ఇంతలో రైలు మీదకు రావడంతో ఆమె అలాగే కదలకుండా పడుకుని ఉండిపోయింది. రైలు ఆమె పై నుంచి వెళ్లిపోయింది.
రైలు వెళ్తున్నంత సేపు ట్రాక్ ఆవల, ఈవల ఉన్నవాళ్లు రైలు ఇంకా ఉంది, అప్పుడే లేవొద్దు అని ఆమెను హెచరిస్తున్నారు. కొందరు ఏం జరుగుతుందోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇంతలో ట్రెయిన్ వెళ్లిపోయింది. సదరు మహిళ ప్రాణాలతో బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్ ఏరియాలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కింది వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి..
ट्रैक एक महिला बेहोश होकर गिर गई. उसी बीच मालगाड़ी आ गई.
मालगाड़ी महिला के ऊपर से निकल गई. बाद में महिला को ट्रैक से सुरक्षित उठा लिया गया. कासगंज में सहावर गेट क्रासिंग के पास की है घटना, वीडियो वायरल
#Kasganj #UttarPradesh #Viralvideo pic.twitter.com/4OUZY29M3A
— Shubham Rai (@shubhamrai80) July 2, 2023