న్యూఢిల్లీ : జంతువులు, మానవుల మధ్య అనుబంధానికి సంబంధించిన ఎన్నో వీడియోలు (Viral Video) ఇంటర్నెట్లో కోకొల్లలుగా కనిపిస్తాయి. ఈ క్లిప్‌ల్లో కొన్నింటిలో వన్యప్రాణుల పట్ల కొందరు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే మరికొందరు వాటి పట్ల దయతో వ్యవహరించిన వీడియోలూ ఉన్నాయి. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వన్ నెట్టింట షేర్ చేసిన లేటెస్ట్ వీడియోలో మనుషులు, జంతువుల మధ్య ఉండాల్సిన సామరస్యతను చాటిచెపుతుంది.
The road stopper !! From Katarniaghat WLS. @aakashbadhawan pic.twitter.com/etxOeJLF5B
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 1, 2023
యూపీలోని కటర్నియగట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో తీసిన ఈ వీడియోను కస్వన్ ట్విట్టర్లో షేర్ చేస్తూ ఈ పోస్ట్‌కు ఐఎఫ్ఎస్కు చెందిన మరో బ్యూరోక్రాట్ ఆకాష్ దీప్ భద్వన్కు కర్టసీ ఇచ్చారు. ఈ వీడియోలో అటవీ మార్గంలోని రోడ్డు ప్రక్కన నీటి కుంటలో పులి నీరుతాగుతుండటం కనిపించింది. దీంతో రోడ్డుకు ముందు, వెనుక కార్లు నిలిచిఉండటం చూడొచ్చు.
పులికి కొంత ప్రైవసీ ఇచ్చేలా వాహనాలన్నీ దానికి దూరంగా నిలిచిపోయాయి. రోడ్స్టాపర్ !! కటర్నియగట్ డబ్ల్యూఎల్‌ఎస్ నుంచి అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి 80000 మందికి పైగా వీక్షించారు. పులి నీరు తాగుతుండగా దాన్ని డిస్ట్రబ్ చేయకుండా కార్లను దూరంగా ఆపిన టూరిస్టులు, స్ధానికులను నెటిజన్లు ప్రశంసించారు. వాహనదారులు పాటించిన దూర దృష్టిపై యూజర్లు ప్రశంసలు గుప్పించారు.
Read More
Virat Kohli: గంభీర్‌తో వాగ్వాదం తర్వాత.. డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ.. వీడియో