కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టనున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్ (Vande Bharat Sleeper train) వ్యయం 50 శాతం పెరిగిందని టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ఆరోపించారు. గతంలో ఒక్కో రైలు తయారీ ఖర్చు రూ.290 కోట్లుగా మోదీ ప్రభుత్వం పేర్కొందని, ఇప్పుడు ఈ వ్యయం రూ.436 కోట్లకు పెరిగిందని విమర్శించారు. దీని వల్ల ఏ కాంట్రాక్టర్ లబ్ధి పొందుతున్నారని ఆయన ప్రశ్నించారు. సాకేత్ గోఖలే ఈ మేరకు సోమవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘200 వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీకి సంబంధించిన రూ.58,000 కోట్ల ఒప్పందాన్ని మోదీ ప్రభుత్వం సవరించింది. రైళ్ల సంఖ్యను 200 నుంచి 133కు తగ్గించింది. ఇంతకుముందు రూ.290 కోట్లు ఖరీదు చేసిన రైలు ఇప్పుడు రూ.436 కోట్లు అవుతున్నది. అన్నీ ఏసీ కోచ్‌లతో కూడిన ఈ రైలు ప్రయాణ ఖర్చును పేదలు భరించలేరు. వందే భారత్ కాంట్రాక్ట్ వ్యయం 50 శాతం పెరుగడం వల్ల ఎవరు ప్రయోజనం పొందుతున్నారు?’ అని అందులో ప్రశ్నించారు.
కాగా, టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ఆరోపణలపై రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆయన వాదనలు తప్పని ఖండించింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని కోరింది. స్లీపర్ ప్రాజెక్ట్‌లో పారదర్శకత కారణంగా ఒక్కో కోచ్ ధర అన్ని బెంచ్‌మార్క్‌ల కంటే తక్కువగా ఉందని తెలిపింది. ‘కాంట్రాక్ట్‌లో ఉన్న మొత్తం కోచ్‌ల సంఖ్యను స్థిరంగా ఉంచాం. పొడవైన రైళ్లను తయారు చేయడానికి కోచ్‌ల సంఖ్యను 16 నుంచి 24కు పెంచాం. గతంలో 16 కోచ్‌లతో కూడిన 200 రైళ్లకు 3200 కోచ్‌లు అవసరం. ఇప్పుడు 24 కోచ్‌లతో కూడిన 133 రైళ్ల కోచ్‌లను 3192గా సవరించాం. రైలు పొడవు పెరిగినప్పటికీ ఆర్థికంగా చూస్తే మొత్తం కాంట్రాక్ట్ విలువ వాస్తవానికి తగ్గింది. రైలు ప్రయాణానికి ఉన్న అధిక డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రికార్డు సంఖ్యలో (12000) నాన్ ఏసీ కోచ్‌లు కూడా తయారు చేస్తున్నాం’ అని రైల్వే మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో పేర్కొంది.
Please stop spreading misinformation and fake news.
Cost per coach multiplied by number of coaches equals the cost of train.
In sleeper project, cost per coach is lower than all benchmarks because of the transparency in process.
We have increased the number of coaches from… https://t.co/tLUmUsGx5x
— Ministry of Railways (@RailMinIndia) September 16, 2024