న్యూఢిల్లీ: ఐర్లాండ్ నుంచి న్యూయార్క్ వెళ్తుండగా 1912లో మునిగిపోయిన టైటానిక్ నౌకలో ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ రాత్రి భోజనం కోసం తయారు చేసిన మెనూను వేలం వేశారు. ఇంగ్లండ్‌లో జరిగిన వేలంలో శనివారం సాయంత్రం ఇది రూ.84.5 లక్షలు పలికింది. అట్లాంటిక్ ప్రయాణంలో ఈ నౌక 1912 ఏప్రిల్ 14న మునిగిపోయింది. ఏప్రిల్ 11నాటి రాత్రి ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్లకు అప్రికాట్స్, ఫ్రెంచ్ ఐస్ క్రీమ్, ఆయిస్టర్స్, సాల్మన్, బీఫ్, స్కాబ్, బాతు, కోడి మాంసం, బంగాళాదుంపలు, అన్నం ఇచ్చినట్లు దీనిని బట్టి తెలుస్తున్నది. తెలుపు రంగు నక్షత్రం ఉన్న ఎరుపు రంగు జెండా ఈ మెనూపై ముద్రించి ఉన్నది.