గవర్నర్లకు గడువు విధించాలి
బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాల్లో అసెంబ్లీలు చేసిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ల వైఖరిపై వివాదం కొత్త మలుపు తీసుకొన్నది. గవర్నర్లు బిల్లులు ఆమోదించడానికి నిర్దిష్ట కాలపరిమితి నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రపతిని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ సోమవారం ఓ తీర్మానం చేసింది. ఇటీవల తమిళనాడు సహా పలు బీజేపీయేతర రాష్ర్టాల్లో బిల్లులను ఆమోదించడంలో గవర్నర్ల వైఖరి వివాదాస్పదమవుతున్నది.
- బిల్లుల ఆమోదానికి తగిన కాలపరిమితి ఉండాలి
- తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
చెన్నై, ఏప్రిల్ 10: బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాల్లో అసెంబ్లీలు చేసిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ల వైఖరిపై వివాదం కొత్త మలుపు తీసుకొన్నది. గవర్నర్లు బిల్లులు ఆమోదించడానికి నిర్దిష్ట కాలపరిమితి నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రపతిని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ సోమవారం ఓ తీర్మానం చేసింది. ఇటీవల తమిళనాడు సహా పలు బీజేపీయేతర రాష్ర్టాల్లో బిల్లులను ఆమోదించడంలో గవర్నర్ల వైఖరి వివాదాస్పదమవుతున్నది. బిల్లులను ఆమోదించకుండా, తిప్పి పంపకుండా గవర్నర్లు తమ వద్దే నెలల తరబడి పెట్టుకుంటుండటంపై ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వద్ద కూడా 2021 సెప్టెంబర్ నుంచి 20 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అధికార డీఎంకే ఆరోపిస్తున్నది.
ఈ నేపథ్యంలో గత వారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో సివిల్ సర్వెంట్లను ఉద్దేశిస్తూ ఆర్ఎన్ రవి మాట్లాడుతూ.. బిల్లులను నిలిపివేయడం అంటే బిల్లులను మర్యాదపూర్వకంగా తిరస్కరించడమేనని, అలాంటి బిల్లులను డెడ్ బిల్లులుగా పరిగణించాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తమిళనాడు ప్రభుత్వం ఈ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ… గవర్నర్ తన ఇష్టాలు, అభిరుచుల కోసం కొన్ని బిల్లులను ఆమోదించడం లేదని ఆరోపించారు. ఆయన రాజ్‌భవన్‌ను రాజకీయ భవన్‌గా మార్చేశారని, తమిళనాడు ప్రజల సంక్షేమానికి గవర్నర్ వ్యతిరేకమని విమర్శించారు.
ఆన్లైన్ గేమింగ్ నిషేధ బిల్లుకు గవర్నర్ ఆమోదం
బిల్లుల ఆమోదంపై గవర్నర్లకు గడువు విధించాలని సోమవారం తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసిన కొన్ని గంటల్లోనే ఆన్లైన్ గేమింగ్ నిషేధ బిల్లుకు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలిపారు. ఆన్లైన్ గేమింగ్‌ను నిషేధిస్తూ మొదటిసారి అసెంబ్లీ ఆమోదించి పంపించిన బిల్లును 131 రోజుల తర్వాత గత నెల గవర్నర్ తిప్పి పంపించారు. దీంతో స్టాలిన్ ప్రభుత్వం మళ్లీ ఈ బిల్లు చేసి పంపించగా సోమవారం గవర్నర్ ఆమోదించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

