సిమ్లా : పచ్చని చెట్లు, పొగమంచు, చుట్టూ కొండలు వాటి మధ్య రైలు ప్రయాణం అనగానే విదేశీ లొకేషన్స్‌ను ఊహించుకుంటారు. అయితే భారత్‌లోనూ ఎన్నో ఆకర్షణీయ ప్రదేశాలు, ఆకట్టుకునే పరిసరాలు ఉన్నాయని ఈ వైరల్ వీడియో (Viral Video) చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. నార్వే దౌత్యవేత్త ఎరిక్ సోలీం దేశీ పర్యాటక ప్రాంతంలోని ఈ అద్భుత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
భారత్‌లో చూడదగిన ప్రదేశాల్లో ఇది ఒకటని ఆయన ట్విట్టర్లో షేర్ చేసిన వీడియో నెటిజన్లను తెగ నచ్చేసింది. కల్క-సిమ్లా రూట్లో ఓ వ్యక్తి అద్భుత సీనరీకి సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ వీడియోలో ఆకుపచ్చ తొడుగుతో కూడిన పర్వతాల్లో పొగమంచును చీల్చుకుంటూ ట్రైన్ దూసుకెళుతుండటం కనిపిస్తుంది.
One of the most beautiful train journey in India 🇮🇳!
Kalka-Shimla railway @GoHimachal_
— Erik Solheim (@ErikSolheim) May 10, 2023
గో హిమాచల్ అనే ట్విట్టర్ పేజ్ ఈ క్లిప్‌ను తొలుత షేర్ చేసింది. భారత్‌లో అత్యంత అందమైన ట్రైన్ జర్నీల్లో ఒకటి! కల్క-సిమ్లా రైల్వే అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను 95,000 మందికి పైగా వీక్షించగా నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టయ్యారు. అందమైన ల్యాండ్‌స్కేప్‌కు ముగ్ధులైన నెటిజన్లు ఈ ప్రదేశానికి ఎలా వెళ్లాలని ఆరా తీశారు.
Read More