e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News ఈ హైటెక్‌ ఆటోలో ఐప్యాడ్‌, టీవీ, ఫ్రిడ్జ్‌, వైఫై.. ఎందుకో తెలుసా?

ఈ హైటెక్‌ ఆటోలో ఐప్యాడ్‌, టీవీ, ఫ్రిడ్జ్‌, వైఫై.. ఎందుకో తెలుసా?

ఈ హైటెక్‌ ఆటోలో ఐప్యాడ్‌, టీవీ, ఫ్రిడ్జ్‌, వైఫై.. ఎందుకో తెలుసా?

చెన్నై: ఓ ఆటోలో ఏముంటాయ్‌? మ‌హా అయితే ఓ మ్యూజిక్ సిస్ట‌మ్‌. కానీ త‌మిళ‌నాడులోని ఈ హైటెక్ ఆటోలో మాత్రం ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోసం కావాల్సిన అన్నీ ఉంటాయి. ఓ ఐప్యాడ్‌, టీవీ, ఓ చిన్న ఫ్రిడ్జ్‌, వైఫై, ఇప్పుడు క‌రోనా టైమ్‌లో మాస్క్‌లు, శానిటైజ‌ర్‌లు కూడా ఉన్నాయి. అందుకే చెన్నై వాసులు ఈ హైటెక్ ఆటో ఎక్క‌డానికి ఇప్పుడు పోటీ ప‌డుతున్నారు. ఓ ఇంట‌ర్ డ్రాపౌట్ అయిన యువ‌కుడు చేసిన‌ వినూత్న ఆలోచ‌న అత‌న్నో పారిశ్రామిక‌వేత్త‌గా చూసే స్థాయికి తీసుకెళ్లింది. ఇంత‌కీ ఎవ‌రా యువ‌కుడు? అత‌ని ల‌క్ష్య‌మేంటో ఓ సారి చూసేయండి.

ఆటో అన్న‌గా ఫేమ‌స్‌

- Advertisement -

ఆ యువ‌కుడి పేరు అన్నాదురై. చెన్నైలో మాత్రం ఆటో అన్న‌గా పేరు సంపాదించాడు. ఇత‌ని వినూత్న ఆలోచ‌న న‌చ్చి హ్యూమ‌న్స్ ఆఫ్ బాంబే ఈ మ‌ధ్యే అత‌నిపై ఓ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆర్థిక కార‌ణాల వ‌ల్ల చ‌దువు మ‌ధ్య‌లోనే ఆపేసిన అన్నాదురై.. ఓ గొప్ప పారిశ్రామికవేత్త‌గా ఎద‌గాల‌న్న త‌న క‌ల‌ను మాత్రం వ‌దిలేయ‌లేదు. అనుకోని ప‌రిస్థితుల్లో ఆటో న‌డపాల్సి వ‌చ్చినా.. త‌న ఎంట‌ర్‌ప్రెన్యూర్ బుర్ర‌కు ప‌ని చెప్పి ఆ ఆటోనే వినూత్నంగా మ‌లిచాడు.

9 ఏళ్ల స‌క్సెస్ స్టోరీ

2012లో అన్నాదురై ఆటో ప్ర‌యాణం మొద‌లైంది. అప్పుడే అత‌ని ఆటో చూసి చాలా మంది ఆశ్చ‌ర్య‌పోయారు. ఆటోలో ప్ర‌యాణ అనుభూతినే పూర్తిగా మార్చేశాడ‌త‌డు. మొద‌ట్లో త‌న ఆటోలో న్యూస్‌పేప‌ర్స్‌, మ్యాగ‌జైన్లు పెట్ట‌డం ప్రారంభించాడు. ప్ర‌యాణికులు త‌న ఆటోలో ఉన్నంత వర‌కూ వారికి బోర్ కొట్ట‌కుండా ఈ ఏర్పాట్లు చేశాడు. ఆ త‌ర్వాత కాలానికి త‌గిన‌ట్లుగా ఆటోను హైటెక్‌గా మార్చేశాడు. పేపర్లు, మ్యాగ‌జైన్ల‌తోపాటు మెల్ల‌గా ఐప్యాడ్‌, ల్యాప్‌టాప్‌, టీవీ, ఫ్రిడ్జ్‌, వైఫై వ‌చ్చి చేరాయి.

అంతేకాదు ఈ మ‌ధ్య చిల్ల‌ర స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌డానికంటూ త‌న ఆటోలో స్వైపింగ్ మెషీన్ కూడా పెట్టాడు. ఎందుకిదంతా అని అడిగితే.. క‌స్ట‌మ‌ర్ సంతృప్తి కోస‌మే అని అన్నాదురై బ‌దులిస్తున్నాడు. నాలుగేళ్ల వ‌య‌సులో చెన్నై వ‌చ్చిన అత‌డు.. త‌న ఇద్ద‌రు సోద‌రులు, ఒక సోద‌రితో క‌లిసి పెరిగాడు. అత‌ని తండ్రి కూడా ఓ ఆటో డ్రైవ‌రే. తండ్రి వృత్తినే తాను చేప‌ట్టినా.. ఓ పారిశ్రామిక‌వేత్త‌గా మారాల‌న్న ఆలోచ‌న‌తో త‌న ఆటోను ఇలా వినూత్నంగా మ‌లిచాడు.

అత‌ని ల‌క్ష్యం ఉన్న‌త‌మైన‌దే..

వినూత్న‌మైన ఆటోతోనే కాదు త‌న ఉన్న‌త‌మైన ఆలోచ‌న‌ల‌తోనూ అన్నాదురై వార్త‌ల్లో నిలుస్తున్నాడు. అత‌డు ఇప్ప‌టికే ఓ చిన్నారి చ‌దువుకు సాయం చేస్తున్నాడు. త‌న ఆటోలో టీచ‌ర్లు, న‌ర్సుల‌ను ఉచితంగా తీసుకెళ్తాడు. ఇక మ‌ద‌ర్స్‌, వుమెన్స్‌, చిల్డ్రెన్‌, ఫాద‌ర్స్‌, ఇండిపెండెన్స్ డే రోజుల్లో ప్ర‌త్యేక ఆఫ‌ర్లు కూడా ఇస్తాడు. ఆటో డ్రైవ‌ర్లుగా రావాల‌నుకుంటున్న వారి కోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను కూడా రూపొందిస్తున్నాడు. అత‌డిప్పుడు చెన్నైలోనే కాదు.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆటో అన్న‌గా ఫేమ‌స్ అయ్యాడు. ఫేస్‌బుక్‌లో అత‌నికి వేల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. అత‌డో మంచి వ‌క్త కూడా. వొడాఫోన్‌, హ్యుండాయ్‌, రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్, గ‌మేశాలాంటి కంపెనీలు త‌మ‌ ఉద్యోగుల కోసం అత‌నితో ప్ర‌త్యేకంగా క్లాసులు కూడా చెప్పించాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈ హైటెక్‌ ఆటోలో ఐప్యాడ్‌, టీవీ, ఫ్రిడ్జ్‌, వైఫై.. ఎందుకో తెలుసా?
ఈ హైటెక్‌ ఆటోలో ఐప్యాడ్‌, టీవీ, ఫ్రిడ్జ్‌, వైఫై.. ఎందుకో తెలుసా?
ఈ హైటెక్‌ ఆటోలో ఐప్యాడ్‌, టీవీ, ఫ్రిడ్జ్‌, వైఫై.. ఎందుకో తెలుసా?

ట్రెండింగ్‌

Advertisement