TMC Manifesto | ఉచిత సిలిండర్లు, ఫ్రీ రేషన్, పేదలకు ఇండ్లు : టీఎంసీ మేనిఫెస్టోలో హామీల వర్షం
TMC Manifesto : లోక్‌సభ ఎన్నికలకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) బుధవారం మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టోలో పేద కుటుంబాలకు ఏటా పది ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, ప్రతి నెలా ఐదు కిలోల ఉచిత రేషన్, రైతులకు కనీస మద్దతు ధర వంటి పలు హామీలను గుప్పించింది.
TMC Manifesto : లోక్‌సభ ఎన్నికలకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) బుధవారం మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టోలో పేద కుటుంబాలకు ఏటా పది ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, ప్రతి నెలా ఐదు కిలోల ఉచిత రేషన్, రైతులకు కనీస మద్దతు ధర వంటి పలు హామీలను గుప్పించింది. పెట్రోల్, డీజిల్ ధరలకు కళ్లెం వేస్తామని, అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకునేలా ధరల స్ధిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చింది. ఉపాధి హామీ కార్డుదారులందరికీ 100 రోజుల పని గ్యారంటీని అమలు చేస్తామని, ఉన్నత విద్యా స్కాలర్ షిప్‌ల సంఖ్యను మూడింతలు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచింది.
వృద్ధాప్య ఫించన్లను నెలకు రూ. 1000కి పెంచనున్నట్టు పేర్కొంది. పేద కుటుంబాలకు ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది. ఇది పేదలందరికీ గౌరవంగా జీవించేందుకు దోహదపడుతుందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి రాగానే తాము ఈ హామీలను నెరవేర్చుతామని కోల్‌కతాలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ తెలిపారు. ఇ
క తాము ఎన్నికల్లో గెలిస్తే, ఎన్ఆర్సీ, సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) అంతకుముందు స్పష్టం చేశారు. సిల్చర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. డిటెన్షన్ క్యాంపులో ఎంత మందిని బంధిస్తారని దీదీ ప్రశ్నించారు. ఈ ఎన్నికలు చాలా భయానకంగా ఉండబోతున్నాయని, గతంలో ఎన్నడు కూడా తాను ఇంత అవినీతి ఎన్నికలను చూడలేదని ఆమె పేర్కొన్నారు. మోదీ సర్కారులో అల్లర్లు గ్యారెంటీ అని, జనం కోసం మోదీ ఏదో చేస్తారని తాను ఆశించడం లేదని, ఇదో మోసపూరిత ప్రభుత్వమని, ఎటువంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని ఆమె అన్నారు.
Read More :
Dubai | ఎడారి దేశాన్ని ముంచెత్తిన భారీ వర్షం.. భారత్-దుబాయ్ మధ్య నడిచే 28 విమానాలు రద్దు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

