ICMR-AIIMS Study | ఆకస్మిక మరణాలకు.. కొవిడ్ టీకాలకు సంబంధం లేదు.. స్పష్టం చేసిన ఐసీఎంఆర్-ఎయిమ్స్ స్టడీ..!
ICMR-AIIMS Study | ఆకస్మిక మరణాలకు కరోనా టీకాలకు సంబంధం లేదని ఓ అధ్యయనంలో తేలింది. భారత వైద్య పరిశోధనా మండలి (ICMR), ఎయిమ్స్ సంయుక్తంగా అధ్యయనం నిర్వహించాయి.
ICMR-AIIMS Study | ఆకస్మిక మరణాలకు కరోనా టీకాలకు సంబంధం లేదని ఓ అధ్యయనంలో తేలింది. భారత వైద్య పరిశోధనా మండలి (ICMR), ఎయిమ్స్ సంయుక్తంగా అధ్యయనం నిర్వహించాయి. కరోనా మహమ్మారి తర్వాత 40 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారిలో హార్ట్ ఎటాక్స్ పెరిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి. వీటికి వ్యాక్సిన్ కారణం కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇటీవల కర్ణాటకలోని హాసన్ జిల్లాలో పలువురు యువకులు హార్ట్ ఎటాక్‌తో మరణించారు. దీనిపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. కొవిడ్ టీకాను వేగంగా పంపిణీ చేయడం వల్లే అది జరుగుతుండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. చెస్ట్‌లో నొప్పి, ఊపిరాడకపోవడం వంటి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ఆసుపత్రిలో వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది.
ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) సంస్థలు జరిపిన సమగ్ర అధ్యయనంలో టీకా కారణంగా మరణాలు సంభవించలేదని తేలింది. ఈ అధ్యయనం 2023 మే నుంచి ఆగస్ట్ వరకు 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 47 ప్రాంతీయ ఆసుపత్రుల సహాయంతో 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారిసై అధ్యయనం జరిపారు. ఇందులో 2021 అక్టోబర్ నుంచి 2023 మార్చి మధ్య అకస్మాత్తుగా సంభవించిన మరణాలను విశ్లేషించారు. ఈ అధ్యయనంలో హార్ట్ ఎటాక్ కేసుల పెరుగుదలకు జన్యుపరమైన మార్పులు (genetic mutation) ప్రధాన కారణంగా గుర్తించారు. ప్రస్తుతం ఎయిమ్స్, ఐసీఎంఆర్ నిధులతో పూర్తిస్థాయిలో అధ్యయనం చేపట్టింది. నివేదిక పూర్తి అయిన తర్వాత AIIMS కూడా ICMR నిధులతో మరో పూర్తిస్థాయి అధ్యయనాన్ని చేపట్టింది.
ఆకస్మిక మరణాలకు కరోనా టీకా కాకుండా జీవనశైలి, మునుపటి ఆరోగ్య సమస్యలు, కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత ఏర్పడిన సమస్యలు, జెనెటిక్ కారణాలు వంటి అనేక అంశాలు కారణమని వివరించారు. కరోనా టీకా మానవాళిని మహమ్మారి నుంచి రక్షించిందని, అనవసరమైన ఆరోపణలు ప్రజల్లో భయాన్ని, టీకాపై నమ్మకాన్ని దెబ్బతీయవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. హాసన్ జిల్లాలో గత నెలలో 20 మందికిపైగా అకస్మాత్తుగా మరణించినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కానీ, ఈ ఘటనలకు సంబంధించి తగిన పరిశోధనలు జరుగుతున్నాయని కేంద్రం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

