Talcum Powder | న్యూఢిల్లీ: సౌందర్య సాధనం టాల్కం పౌడర్ వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్సీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. మనుషుల్లో అండాశయ క్యాన్సర్‌కు టాల్కం పౌడర్ కారణమవుతుందని చెప్పడానికి ఆధారాలు పరిమితంగా ఉన్నాయి.
ఎలుకల్లో ఇది వస్తుందని చెప్పడానికి తగినంత సాక్ష్యం ఉంది. టాల్కం వల్ల మనుషుల కణాల్లో క్యాన్సర్ సంకేతాలకు సంబంధించిన బలమైన ఆధారాలు ఉన్నాయి. జననాంగాలపై టాల్కం పౌడర్‌ను రాసుకునే మహిళల్లో అండాశయ క్యాన్సర్ రేటు పెరుగుతున్నట్లు అనేక అధ్యయనాలు వెల్లడించాయి. అయితే ఈ రీసెర్చ్‌తో సంబంధం లేని స్టాటిస్టీషియన్ కెవిన్ మెక్కాన్వే మాట్లాడుతూ, ఇదంతా తప్పుదోవ పట్టించే సమాచారమని చెప్పారు.