న్యూఢిల్లీ : సిక్కింలోని పాక్యోంగ్ జిల్లాలో గురువారం జరిగిన ప్రమాదంలో నలుగురు భారత సైనికులు మరణించారు. పశ్చిమ బెంగాల్‌లోని పెడోంగ్ నుంచి సిక్కింలోని జులూక్కు సిల్క్ రూట్ గుండా వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న వాహనం దాదాపు 800 అడుగుల లోతుగల లోయలో పడిపోయింది. ఈ వాహనం డ్రైవర్ ప్రదీప్ పటేల్, క్రాఫ్ట్స్మన్ డబ్ల్యూ పీటర్, నాయక్ గురుసేవ్ సింగ్, సుబేదార్ తంగపండి మరణించినట్లు అధికారులు గుర్తించారు. వీరంతా పశ్చిమ బెంగాల్‌లోని బినగురి యూనిట్‌కు చెందినవారు.