న్యూఢిల్లీ, జూలై 28: అమెరికాలోని దక్షిణ కరోలినా బీచ్లో రెండు తలల తాబేలు కనిపించింది. సాధారణంగా జూన్-ఆగస్టు మధ్యలో బీచ్లో తాబేళ్లు గుడ్లు పెట్టి పిల్లలను చేస్తాయి. ఈ గుడ్లను ఎవరూ ధ్వంసం చేయకుండా వలంటీర్లు వాటిని వెతికి ఆయా చోట్ల తగిన జాగ్రత్తలు తీసుకొంటారు. ఇలా గుడ్ల కోసం వెతుకుతున్న క్రమంలోనే ఈ తాబేలు కనిపించింది.