ఆదివారం 24 జనవరి 2021
National - Dec 19, 2020 , 18:44:46

‘బోర్న్‌ ఆన్‌ ఇన్‌స్టాగ్రామ్‌’ రెండవ ఎడిషన్‌ ప్రారంభించిన ఇన్‌స్టాగ్రామ్‌

  ‘బోర్న్‌ ఆన్‌ ఇన్‌స్టాగ్రామ్‌’ రెండవ ఎడిషన్‌ ప్రారంభించిన ఇన్‌స్టాగ్రామ్‌

హైదరాబాద్: ఇన్‌స్టాగ్రామ్‌ తమ ‘బోర్న్‌ ఆన్‌ ఇన్‌స్టాగ్రామ్‌’ కార్యక్రమ రెండవ ఎడిషన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా  ఇన్‌స్టాగ్రామ్‌పై అత్యుత్తమంగా ఆధారపడే జ్ఞానాన్ని అందించడంతో పాటుగా 2020లో జోడించిన నూతనఫీచర్లతో  ముఖ్యంగా రీల్స్‌పై దృష్టి కేంద్రీకరించి తమ కథలను చెప్పే సామర్థ్యమూ మెరుగుపరుస్తుంది. దశాబ్దపు ప్రయాణాన్నిఇన్‌స్టాగ్రామ్‌ పూర్తి చేసింది, ఈ ప్రయాణం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్‌ యువత, క్రియేటర్లపై దృష్టి కేంద్రీకరించి అభివృద్ధి చెందింది.

ఈ పరిణామక్రమంలో కేవలం ఫోటో షేరింగ్‌ యాప్‌ నుంచి కథలను జోడించడం, లైవ్‌, ఐజీటీవీ ఇప్పుడు రీల్స్‌ జోడించడం వరకూ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌పై నూతన ఫీచర్‌ రీల్స్‌. ప్రజలు స్వల్ప వినోదాన్ని సృష్టించి, పంచుకోవడానికి ఇది అనుమతిస్తుంది.  దీనిలో ఉన్న అద్భుత అంశం  ఏమిటంటే రీల్స్‌ కోసం మీకు పెద్దగా ఫాలోయింగ్‌ ఉండాల్సిన అవసరం లేదు. అత్యుత్తమ కంటెంట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వైవిధ్యమైన కమ్యూనిటీ పూర్తిగా అంకితం చేసిన రీల్స్‌ ట్యాబ్‌  స్పేస్‌ ఇన్‌ ఎక్స్‌ప్లోర్‌ ద్వారా కనుగొనవచ్చు.

క్రియేటర్లు అయిన షగున్‌ సేన్‌ ((@eattripclick), ఆకాంక్ష కొమ్మిరెల్లి ((@akankshakommirelly) కార్తీక్‌ అభిరామ్‌ ((@karthikabhiram) ఇప్పటికే వీరు ఇన్‌స్టాగ్రామ్‌పై రీల్స్‌ ఆవిష్కరించిన నాటి నుంచి విజయం సాధించారు.ఫేస్‌బుక్‌ ఇండియా డైరెక్టర్‌ అండ్‌ హెడ్‌ ఆఫ్‌ పార్టనర్‌షిప్స్ మనీష్‌ చోప్రా మాట్లాడుతూ ‘‘బోర్న్‌ ఆన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వినూత్న కార్యక్రమం. క్రియేటర్ల కోసం సంస్ధాగత అభ్యాస వాతావరణం ఇది సృష్టిస్తుంది. తద్వారా వారు అత్యుత్తమంగా అర్థం చేసుకోవడంతో పాటుగా ఇన్‌స్టాగ్రామ్‌పై ఆధారపడగలరు. సృజనాత్మకత , వ్యవస్థాపక స్ఫూర్తిని పెంపొందించడంపై మేము దృష్టి సారించాము. హైదరాబాద్‌లోని క్రియేటర్లలో దీనిని మేము చూశాము. తద్వారా భారతదేశంలో అతిపెద్ద కంటెంట్‌ క్రియేటర్లను గుర్తించి ప్రోత్సహించనున్నాం’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నమోదు చేసుకోవడానికి https://boireels.splashthat.com/ చూడొచ్చు. 

ఇవి కూడా చదవండి... వేగం పుంజుకోనున్నభారత ఆర్థికవ్యవస్థ...

  ఈ ఆరు వెబ్ సైట్లు అస్సలు ఓపెన్ చేయొద్దు.. ఎందుకంటే...?

'శ్రీ గురు తేఘ్‌ బహదూర్‌ జీ'కి ప్రదాని మోడీ నివాళులు

మంచు లక్ష్మీ కుమార్తెకు నొబెల్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డు

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి


logo