కోల్‌కతా, జూలై 12: పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఎంసీ స్వీప్ చేసింది. ప్రతిపక్ష బీజే పీ, కాంగ్రెస్, సీపీఎం కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. 63,229 గ్రామ పంచాయతీలకు గానూ టీఎంసీ 35 వేలకు పైగా స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.
9,728 పంచాయతీ సమితిల్లో 6,430 స్థానాలను చేజిక్కించుకొన్నది. 928 జిల్లా పరిషత్‌లకు 674 స్థానాల్లో టీఎంసీ జెండా పాతింది. బుధవారం రాత్రి సమయానికి మరికొన్నింటిలో లీడింగ్‌లో కొనసాగుతున్నది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భాంగొరేలో ఓ కౌంటింగ్ బూత్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణలో ఇద్దరు ఐఎస్ఎఫ్ కార్యకర్తలతో సహా ముగ్గురు మరణించారని పోలీసులు తెలిపారు.