న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల అంతరిక్ష ప్రయోగాల వల్ల రోదసిలో చెత్త సమస్య తీవ్రతరమవుతున్నది. భూ మండలానికి ప్రమాదకరంగా మారుతున్నది. మానవుడు తయారు చేసిన ఎలక్ట్రానిక్ తదితర వస్తువులు అంతరిక్షంలో ముక్కలైపోయి, వాడటానికి పనికిరాకుండా భూ కక్ష్యలో పోగు పడుతున్నాయి.
ఈ వ్యర్థాల వల్ల రోదసి మిషన్స్‌కు ముప్పు ఏర్పడుతుందని తాజాగా వెలువడిన అంతరిక్ష పర్యావరణ నివేదిక-2024 వెల్లడించింది. 40 వేల వస్తువులు రోదసిలో చెత్తగా పేరుకుపోయి ఉన్నాయి. వీటి వల్ల పర్యావరణం దెబ్బతినడం, ఉపగ్రహాలు, వ్యోమ నౌకలను ఢీకొట్టడం వంటివి జరుగుతాయి.