న్యూఢిల్లీ, అక్టోబర్ 12: నౌకాదళానికి చెందిన ‘మిగ్-29కే’ యుద్ధవిమానం కుప్పకూలింది. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా పైలట్ బుధవారం కూడా యుద్ధ విమానంలో గోవా తీరంలో చక్కర్లు కొట్టారు. అయితే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఒక్కసారిగా కూలిపోయింది. అదృష్టవశాత్తూ పైలట్ ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. మిగ్ 29కే యుద్ధ విమానాలకు రష్యా ఏరోస్పేస్ కంపెనీ అభివృద్ధి చేసింది. దాదాపు రూ.100 కోట్లు వెచ్చించి దశాబ్దం కిందట 45 మిగ్29కే విమానాలను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది.