న్యూఢిల్లీ: పౌర అణు రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి అవకాశం కల్పించేందుకు ఉద్దేశించిన శాంతి బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ నెల 23న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించబోతున్నట్లు ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ గురువారం ప్రకటించింది.
సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, సంయుక్త కిసాన్ మోర్చాతో కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపింది. జిల్లాలు, నగరాలు, పట్టణాల్లో నిర్వహించే ఈ కార్యక్రమాల్లో కోట్లాది మంది ఉద్యోగులు, కార్మికులు, రైతులు పాల్గొంటారని పేర్కొంది.