న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ మరొకరి చేతికి వెళ్లిపోగానే.. అందులో వాట్సాప్ తెరుచుకోకుండా ‘లాక్’ చేసే ఆప్షన్ త్వరలో అందుబాటులోకి రాబోతున్నది. లాక్‌చాట్ అనే ఆప్షన్‌పై వాట్సాప్ కసరత్తు చేస్తున్నదని ‘వాబీటాఇన్ఫో’ వెల్లడించింది.
ఫోన్ కాంటాక్ట్ లేదా గ్రూప్‌లో ప్రైవేటు చాట్‌ను లాక్ చేసే విధంగా ‘లాక్ చాట్’ ఆప్షన్‌ను రూపొందించారని తెలిపింది. ఈ ఆప్షన్ యాక్టివ్ చేస్తే, వాట్సాప్‌లోని వీడియోలు, ఫొటోలు స్మార్ట్‌ఫోన్ గ్యాలరీలో కనపడవు.