జూన్ 3న కేరళకు నైరుతి రుతుపవనాలు: ఐఎండీ
Mansoon to Kerala: జూన్ 3 నాటికి రుతు పవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టంచేసింది.

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు కేరళ తీరానికి చాలా దగ్గరగా వచ్చాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) తెలిపింది. ముందుగా జూన్ 1ననే రుతుపవనాలు కేరళకు వస్తాయని అంచనా వేసినప్పటికీ.. మందగమనం కారణంగా మరో రెండు రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జూన్ 3 నాటికి రుతు పవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టంచేసింది.
ఈ రోజు ఉపరితల ద్రోణి తూర్పు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా విదర్భ వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమిటర్ల ఎత్తువరకు ఏర్పడిందని తెలిపింది. అంతే కాకుండా ఉపరితల ఆవర్తనం తమిళనాడుతోపాటు పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు నుంచి 7.6 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉందని తెలిపింది. రాగల మూడు రోజులపాటు తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

