భద్రతాబలగాల బలిదానాలు వృథా కాబోవు: ఛత్తీస్‌గఢ్ సీఎం

గువాహటి: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతాబలగాలపై నక్సల్స్ దాడి ఘటన విచారకరమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ అన్నారు. ఎన్నికల ప్రచారం కోసం అసోంలో పర్యటిస్తున్న ఆయన ఈ ఉదయం గువాహటిలో మీడియాతో మాట్లాడారు. నక్సల్స్ దాడిలో గాయపడిన ఏడుగురు సిబ్బందిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని రాయ్‌పూర్ ఆస్పత్రి వైద్యులు చెప్పినట్లు ఆయన తెలిపారు. గల్లంతైన 21 మంది భద్రతాసిబ్బంది కోసం గాలింపు కొనసాగుతున్నదని చెప్పారు.
కేంద్రమంత్రి హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశారని, పరిస్థితిని పర్యవేక్షించడం కోసం సీఆర్పీఎఫ్ డీజీని పంపుతున్నట్లు చెప్పారని భూపేష్ భగేల్ వెల్లడించారు. తాను కూడా ఈ సాయంత్రానికి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు. నక్సల్స్‌కు, భద్రతాసిబ్బందికి మధ్య దాదాపు నాలుగు గంటలపాటు కాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో నక్సల్స్ వైపు కూడా భారీగా ప్రాణ నష్టం జరిగి ఉంటుందన్నారు. ఏదేమైనా భద్రతాసిబ్బంది బలిదానాలు మాత్రం వృథా కాబోవన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కొవిడ్‌పై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష..!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. స్టార్ ప్లేయర్‌కు కరోనా
దేశంలో కరోనా ఉగ్రరూపం.. 24గంటల్లో 93,249 కేసులు
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌కు కరోనా
నీళ్లను కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చని మీకు తెలుసా..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

